భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

సకలేంద్రియములార

సకలేంద్రియములార ఇపుడు సమయము గాదు సద్దుసేయక యుండరే
ప్రకటముగ మాయింటపండుగై జానకీసతిపూజసేయువేళ మీరు 

నిరతమును పదునాల్గుభువనములు కుక్షిలో నిర్వహించెడి స్వామికి
ఇరవుగను మా హృదయకమల కర్ణిక మధ్యమున భక్తి నుంచికొనియు
శరణాగతత్రాణ బిరుదుగలిగిన తండ్రి కరుణింపుమని వేడు
నరసింహదేవునకు నేను పంచామృతస్నాన మొనరించు వేళ మీరు 

తళుకుతళుకున ముద్దుగులుకు జగికుందనపు నిలువుటంగీదొడిగిరే
నలురు ఘుమఘుమ పరిమళించు వనమాలికాహారము మెడను వేసి
లలిత కౌస్తుభ దివ్యరత్నముల చొక్కపుతాళి మెడవేసి అలద
యాపరవిగ్రహంనకు భుజకీర్తులను హరి సవరించువేళ మీరు 

పదియారువన్నె బంగారుశాలువ దట్టికట్టివిదియ చంద్రుని
నుదుట కస్తూరినామమునుదిద్ది తామరసాది మృదుపదములందు
కదసి మువ్వలు పాదములందెలు ఘల్లు ఘల్లు మనపొంకముగనుంచి
అచట వడ్యాణములు మెలనూలుఘంట హరికి నలంకరించు వేళ మీరు 

ఖడ్గ కౌమోదికి శంఖచక్రనందన శార్ఙ్గకార్ముకాంచిత కరములు శ్రీమించు
కనకంపు హరుమంజి ముత్యాల చిలికి కడియములమర్చి
ప్రేమచక్కని వేళ్ళముద్దుటుంగరములను ప్రియ మొప్పవీనులందు
మా మనోహరునకు వజ్రముల కర్ణకుండలములమరించు వేళ మీరు 

శిరములను శతకోటి సూర్యులనుమించి భానురకిరితము ధరించి
హరి పాదకమలములను మంచి స్వర్ణపు పువ్వులను పూజించేసి
అగరు ధూపదీపనైవేద్య తాంబూలాది సకలోపచార మొసగి
సరస భద్రాద్రీశునకు రామదాసుడు సాష్టాంగ మొనరించువేళ మీరు


Download

No comments:

Post a Comment