భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

దీనదయాళో

దీనదయాళో దీనదయాళో దీనదయా పరదేవదయాళో

కనకాంబర ఘనశ్యామదయాళో సనకాది మునియోగి వినుత దయాళో
శరధిబంధన రామచంద్ర దయాళో వర దామర బృందానంద దయాళో

నారదముని దేవనాథదయాళో సారసాక్ష రఘునాథదయాళో
దశరథ సుతలోకాధార దయాళో పశుపతిచాపత్రుటిత దయాళో

ఆగమరక్షిత అమితదయాళో భోగిశయన పరమపురుష దయాళో
వరభద్రాద్రినివాసదయాళో పాలితశ్రీరామదాసదయాళో


Download

No comments:

Post a Comment