భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Thursday, May 20, 2010

ఇనకుల తిలక

ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా
శ్రీరామచంద్రా విని వినకున్నావు
వినరాదా నామొర శ్రీరామచంద్రా || ఇనకుల ||

కనకాంబరధర కపటమేలనయ్యా
శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా
జాగుసేయకు శ్రీరామచంద్రా || ఇనకుల ||

దశరథసుత నాదశ జూడవయ్యా
శ్రీరామచంద్రా పశుపతి నుతనామ
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా || ఇనకుల ||

నేవే గతియని నెర నమ్మియున్నాను
శ్రీరామచంద్రా కావవే యీవేళ
కాకుత్స కులతిలక శ్రీరామచంద్రా || ఇనకుల ||

వైకుంఠవాసుడ విని బాధ మాన్పవే
శ్రీరామచంద్రా నీ కంటె గతిలేరు
నిర్దయజూడకు శ్రీరామచంద్రా || ఇనకుల ||

రామభద్ర శైలధామ శ్రీరామ
శ్రీరామచంద్రా వేమరు వేడెద
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్ర || ఇనకుల ||

No comments:

Post a Comment