రామా రామా భద్రాచల రామా రార రామ రామ || రామ ||
రామా రారా నీమోమిపుడే ప్రేమతీర చూతుగాని
తామసము వలదు రామ స్వామి తాళజాలనికను || రామ ||
ఎన్నడు నే నిన్ను నమ్మి యున్న వాడనని యెంచి
కనులెత్తి చూచి నన్ను మన్ననతో బ్రోవ రాదా || రామ ||
మాటి మాటికి నీతోటి సాటి వేల్పులు లేరని
చాటుచున్న నన్ను నీవె పాట్లుపెట్ట నీటగునటరా || రామ ||
భద్రగిరి రామదాస పాలకుడవై నీవేల
ఛిద్రములెల్ల తొలగించి భద్రముగ నన్నేల వేల || రామ ||
Download
No comments:
Post a Comment