భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

పాహిమాం శ్రీ రామాయంటె

పాహిమాం శ్రీ రామాయంటె పలుకవైతివి
నిస్నేహమిట్టిదనిచెప్పనో హోహోహోహోహోహో

ఇబ్బంది నొంది యాకరిబొబ్బ పెట్టినంతలోనే
గొబ్బునగాచితివట జాగుసేయక
నిబ్బరముతో నేనెంతో కబ్బమిచ్చి వేడుకున్న
తబ్బిబ్బు చేసెదవు రామ అబ్బబ్బబ్బబ్బబ్బ

సన్నుతించు వారినెల్ల మున్నుదయతో బ్రోచితివని
పన్నగశాయినే నిన్నే విన్నవించితి
విన్నపమువినక యెంతో కన్నడజేసెదవు రామా
యెన్నటికి నమ్మరాదు రన్నన్నన్నన్నన్నన్న

చయ్యన భద్రాద్రినిలయ స్వామివని నమ్మి నేను
వేయారు విధముల నుతిచేయసాగితి
ఈయెడను రామదాసుని కుయ్యావించిప్రోవకున్న
నీయొయ్యార మేమనవచ్చునయ్యయ్యయ్యయ్యయ్యయ్యో


Download

No comments:

Post a Comment