భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

బిడియమేలనిక

బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటిపోరా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా 

మురియుచు నీ ధరజెప్పినట్లు విన ముచికుందుడగాను
అరుదుమీరలని నెగురువేయ నే హనుమంతుడగాను
సరగున మ్రుచ్చులమాటలు విననే జాంబవంతుడనుగాను
బిరబిర మీవల లోపల బడనే విభీషణుడనుగాను 

మాయచేత వంచింపబడగనే మహేశుడనుగాను
న్యాయము లేకయే యిటునటు దిరుగును నారదుండగాను
ఆయముచెడి హరినరుడని కొలువను నర్జునుండగాను
దాయాదుండని మదిలో మురియను దశరథుడనుగాను 

గరిమతోడ మా సీతనుజూడ కాచితినిందాక
పరగభద్రుని శిఖరవాసా పరబలసంహార
నరహరి నను రక్షింపవేగమే నారాయణరూపా
మరచి నిదురలోనైనను మీపద సరసిజములు మరువ

No comments:

Post a Comment