భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

నరహరిని నమ్మక

నరహరిని నమ్మక నరులను నమ్మిన నరజన్మమీడేరునా
చెఱకుండగ వెఱ్ఱిచెఱకును నమలిన జిహ్వకు రుచిపుట్టినా మనసా

కాళ్ళుండగ మోకాళ్ళతో నడిచిన కాశీకి పోవచ్చునా
నీళ్ళుండగ నుమ్మినీటినిమ్రింగిన నిండుదాహముదీరునా మనసా

కొమ్మయుండగ గొయ్యబొమ్మను గలిసిన కోరిక కొనసాగునా
అమ్మయుండగ పెద్దమ్మనుగోరిన నర్ధము చేకూరునా మనసా

అన్నముండగ నానబియ్యము దినినంత యాకలివెతదీరునా
వెలదులుండగ చిన్నకన్నెలగలిసిన కామవ్యధులు దీరునా మనసా

క్షుద్రబాధచే నుపద్రవములు బడువేళ నిద్రకంటికి వచ్చునా
భద్రగిరీశుపై భక్తిలేని నరుడు పరమును గననేర్చునా

No comments:

Post a Comment