భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

రామచంద్రులు నాపై

రామచంద్రులు నాపై చలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మ నీ వైన సీతమ్మ చెప్పవమ్మ || రామచంద్రులు ||

కట కట వినడేమి సేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు
కర్మము లెటులుండునోకద ధర్మమే నీకుందునమ్మా || రామచంద్రులు ||

దిన దినము మీచుట్టు దీనతతో తిరుగ దిక్కెవ్వరో యమ్మ
దీనపోషకు డనుచు వేడితి
దిక్కులన్నియు ప్రకటమాయెను ఒకమాటైన
అనడు ఎక్కువేమని తలతునమ్మా || రామచంద్రులు ||

కౌసల్య తనయుడు కపటము చేసినాడు కారణ మేముండెనో
కన్నడ చేసెదవా నీ కన్నుల వై భవముతోడ
విన్నవింప గదవమ్మా నీ
కన్న దిక్కెవరో యమ్మ || రామచంద్రులు ||

దశరధాత్మజుడెంతో దయశాలి యనుకొంటి ధర్మహీనుడోయమ్మ
దాస జనులకు దాత యితడట
వాసిగ భద్రగిరీశుడు రామదాసు నేల
రాడట రవికులాంబుధి సోముడట || రామచంద్రులు ||


Download

No comments:

Post a Comment