రామ జోగిమందు కొనరే ఓ జనులారా || రామ ||
రామజోగి మందుకొని ప్రేమతో భుజియించుడన్న
కామక్రోధ లోభమోహ ఘనమైన రోగాలకు మందు || రామ ||
కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు
సాటిలేని జగమునందు స్వామిరామ జోగిమందు || రామ ||
వాదుకు చెప్పినగాని వారి పాపములు గొట్టి
ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగిమందు || రామ ||
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు ముదముతో సేవించే మందు || రామ ||
No comments:
Post a Comment