నిను పోనిచ్చెదనా సీతారామ
నిను పోనిచ్చెదనా సీతారామ || నిను పోనిచ్చెదనా ||
నిను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ
మైనగాని నా కనులాన శ్రీరామ || నిను పోనిచ్చెదనా ||
రట్టుసేసెద నిన్ను అరికట్టుదు నింక మొర
పెట్టుకోరా దిక్కు కలిగితే రామ
గట్టిగ నీపద కమలము లెప్పుడు
పట్టి నా మదిలో గట్టియుందును శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||
పడి పడి మీవెంట పడి తిరుగ నెంతో
జడియను నీవెందు జరిగెదవురా రామ
తడయక నీ తల్లి తండ్రులు వచ్చినగాని
విడిచిపెట్టిన నీ కొడుకునురా శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||
మావాడని మొగమాటము లేక నే
సేవజేసి రవ్వ సేయుదురా రామ
నీవు భద్రాచల నిలయుడవై నన్ను
కావవయ్యా రామదాస పోషక శ్రీరామా || నిను పోనిచ్చెదనా ||
Download
No comments:
Post a Comment