నిన్ను నమ్మి యున్నవాడను ఓ రామ || నిన్ను ||
నిన్ను నమ్మినవాడ పరులను వేడ నిక
మన్నన జేసి పాలింపవే ఓ రామ || నిన్ను ||
బ్రతిమాలి వ్రతము చెడుటేగాని యిదేమి సుఖము
వెత నొందగ జాలనే ఓ రామ || నిన్ను ||
మానము విడచి కసుమాల పొట్టకొరకై
మానవుల వెంబడింతునే ఓ రామ || నిన్ను ||
సతతము రక్షించు చతురత నీ కున్నప్పుడు మది
చంచలింప నేటికే ఓ రామ || నిన్ను ||
సతతము భద్రాద్రి స్వామి శ్రీ రామ దాస
పతివై నన్నాదరింపవే ఓ రామ || నిన్ను ||
No comments:
Post a Comment