ఓ రామ నీ నామ మేమి రుచిరా
శ్రీరామ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల
గాచిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ
కమ్మన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
నవరసములకన్న నవనీతములకంటె
అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె
అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
అంజనతనయు హృత్కమలంబునందు
రంజిల్లు నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
శ్రీ సదాశివుడు తా నేవేళ భజియించు
శుభరూప నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
సారములేని సంసార తరుణమునకు
తారకము నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
శరణన్న జనులను సరగున రక్షించు
బిరుదుగల్గిన నామ మేమి రుచిరా || ఓ రామ ||
తంబురనారదుల్ డంబమీరగ గా
నంబు చేసెడి నామ మేమి రుచిరా || ఓ రామ ||
అరయ భద్రాచల శ్రీ రామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||
Download
No comments:
Post a Comment