ఓ రఘువీరా యని నే పిలిచిన
నో హో యనరాదా రామ
సారెకు వేసరి నామది యన్యము
చేరదు యేరా ధీర రాను || ఓ రఘువీరా ||
నీటచిక్కి కరి మాటికి వేసరి
నాటక ధర నీ పాటలు బాపగ
మేటి మకరితల మీటికాచు దయ
యేటికి నాపై నేటికి రాదో || ఓ రఘువీరా ||
మున్ను సభను నాపన్నత వేడుచు
నిన్ను కృష్ణయని ఎన్నగ ద్రౌపది
కెన్నో వలువలిడి మన్నన బ్రోచిన
వెన్నుడ నామొర వింటివొ లేదో || ఓ రఘువీరా ||
బంటునై తినని యుంటె పరాకున
నుంటివి ముక్కంటి వినుత నామ
జంట బాయకను వెంట నుండుమని
వేడితి భద్రాచలవాసా || ఓ రఘువీరా ||
No comments:
Post a Comment