భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

నీ సంకల్పం

నీ సంకల్పం బెటువంటిదో గన
నేనెంతవాడను రామా
వాలి దొరగి నీ దాసజనులు భువి
గాసి పడిన యా ఘనమెవ్వరిదో

బ్రోచిన మరి విడజూచిన నీకృప
గాచియుండు గాని
తోచి దోచకను తొడరికరంబులు
చాచి పరులనే యాచన సేయను

పటుతరముగ నీ మటు మాయలకును
నెటువలె నోరుతును
చటుల తరంబుగ జెలగు భవాంబుధి
నెటు దాటుదు నేనెవరిదూరుదు

భావజరిపునుత పరమపురుష నీ
భావము దెలియదుగా
దేవ దేవ నీసేవక జనులకు
సేవకుడును ననుగావు మ్రొక్కెదను

దరిజేర్చెదవని ధైర్యముచే నీ
దరిజేరితి గాని
యరసి బ్రోవగదె యారడిబెట్టుట
లెరుగనైతి నాదొరవను కొంటిని

శరణాగత రక్షణ భవసాగర
తరణా రిపు హరణా
కరుణజూడు భద్రాద్రివాస
అరమరసేయక హరి నిను నమ్మితి

No comments:

Post a Comment