భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

కలియుగ వైకుంఠము

కలియుగ వైకుంఠము భద్రాచలనిలయము సేవింతము
అలివేణులారా మీరానందముగ వేగ విలసితమైనట్టి వేడుకచూడరె

కాంచనసౌధములు మానికంపు మించిన దూలములు
వజ్రములు చెక్కించిన స్తంభములు
పగడములని భ్రమించు ద్వారములు
అంచయాన మరియెంచి లేనుగాదె
మంచిపచ్చలు గూర్చిన వాకిళ్ళు

బంగారుగోపురములు దేవళముల వెలుంగు మాణిక్యములు
భేరిమృదంగాది నాదములు భాగవతుల సంకీర్తనలు
సొంపైన కళ్యాణరత్న మంటపములు
శృంగారమేమని దెలియ విన్నవింతు

తీరైన పురవీధుల సొంపైన కోనేరులు
సోపానములు సకల ఫలతరువులు
ఆ నదులు ఋషి గంధర్వ నివాసములు
సరసిజాక్షి వినవే సిరిలేని గోదావరిస్నానమున సంవత్కరమై యొప్పినది

చక్కని స్త్రీ పురుషులు పట్టణమందు
పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు మక్కువతో పూజలు
వేదశాస్త్రతార్కిక వైష్ణవులుగ్రక్కున వారిని కన్నులజూచి
తక్కువైన పుణ్యమేయని తెల్పుదు

వామాక్షులాడగను సీతనుగూడి
హేమపీఠమునందు సంపూర్ణకళలు మోము వెలుగగను
పరివారములు ప్రేమతో గొలువగను
ప్రేమచే భద్రాద్రిరామదాసుని నేలు
స్వామి శ్రీకోదండరాము నివాసము


Download

No comments:

Post a Comment