భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

సామాన్యుల చెంత

సామాన్యుల చెంత చేరము
రామ నామ మంత్రమె మాకు నీమము
సామగానలోలు సన్నుతించిన
మాకేమి కొదవ సీతారాములున్నారు 

మూలకారణుని లీల తెలియలేని
మూఢులైన వారి నొల్లము
వాలాయముగను వారిజాక్షునికథల
మేలెరుగని వారి నొల్లము 

ధర్మ సూన్యులైన దారుణ కర్ముల
దరికి చేర మేమొల్లము
మర్మమెరిగినట్టి మదన జనకుడైన
ధర్మ మూర్తి రామ తారకమే చాలు 

తామసంబుచేత తామె పెద్దలమని
తత్వమెరుగని వారి నొల్లము
కామాదుల చేత గర్వమొందియున్న
కలుష చిత్తులవారి నొల్లము 

నియమకర్మాది వినిష్ఠ లేని
పరమ నీచులైన వారి నొల్లము
రామదాసునేలు రఘుకులాగ్రజుని
ప్రేమతో భద్రాద్రి రాముని కొలువని


Download

No comments:

Post a Comment