భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

భళి వైరాగ్యంబెంతో

భళి వైరాగ్యంబెంతో బాగై యున్నది చం
చలమైన నామనసు నిశ్చలమై యున్నది || భళి ||

అరిషడ్వర్గములు నన్నంటకున్నవి శ్రీ
హరి నామ స్మరణ జిహ్వకు అనువై యున్నది || భళి ||

గురుధానమున మనసుకుదురై యున్నది చిత్త
మిరువది యారింటి మీద నిరవై యున్నది || భళి ||

పరమ శాంతమెన్నగను బాగై యున్నది మాకు
పరతత్వమందే మా బుద్ధి పట్టియున్నది || భళి ||

విరసము పోరులేని విధమై యున్నది మాకు
ప్రకృతి యెడబాసి మోక్షమున కిరవై యున్నది || భళి ||

గురి భద్రాద్రీశునందే గురువై యున్నది యిపుడు
అరమరలేక రామదాసుడనదగి యున్నది || భళి ||

No comments:

Post a Comment