భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

ఏమయ్య

ఏమయ్య రామబ్రహ్మేంద్రాదులకైన
నీ మాయ దెలియవశమా
కామాది వినుత గుణధామకువలయదళ
శ్యామా నన్ను గన్నతండ్రి రామా

సుతుడనుచు కవులు క్షితినాధుడనుచు భూ
పతులు కొలిచిరిగాని పతిత పావనుడనుచు మతి తెలియలేరైరి

చెలియకాడవనుచు పాండవులు నిజ
విరోధివటంచునల జరాసంధాదులు కలవాడవని
కుచేలుండు నెరింగిరిగాని ఓజలజాక్ష నిన్ను సేవింపలేరైరి

నరుడవని నరులు తమ దొరవనుచు యాదవులు
నరుడనుచు కోపింతురు కరివరద భద్రాద్రిపుర నిలయ
రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

No comments:

Post a Comment