భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

ఏలాగు తాళుదు

ఏలాగు తాళుదు నేమిసేతు రామా
ఈ జాలిచేతను తాళజాలను రామా
దీనజనులకెల్ల దిక్కు నీవే రామా
మనమున నిన్ను నేమరవనో రామా

పావనమూర్తి యో పట్టభిరామా
కావవే యీవేళ కౌసల్యరామా
శరణని నీమరుగుజేరితి రామా
శరణంటే కాచేది బిరుదు రఘురామా

చెప్పరానిప్రేమ నెందు దాతుర రామా
ఆపన్నరక్షకుడ నాపాలి శ్రీరామా
నీ సొమ్మునే నటుల నిజమాయె రామా
నా దోషములన్ని దొలగింపవె రామా

రాతికైన చెమట రంజిల్లునో రామా
ఆ తీరు నీ మనసునొందదు శ్రీరామా
యమబాధ నొందగనేరనో రామా
యమదండనలు లేక యెడబాపు రామా

వాసిగ రామకీర్తనలు జేసితి రామా
రామదాసునిమీద దయయుంచుమీ రామా

No comments:

Post a Comment