కట కట నీదు సంకల్ప మెట్టిదో గాని
నే నెంతవాడనురా రామ || కట కట ||
నిటలాక్షుడు తొల్లి నీ మాయగనలేక
తటుకున నీ వల తగిలెను గనుక || కట కట ||
శరణన్న మునులను బిరబిర బ్రోచెడు
బిరుదు గలిగిన దొరవే ఓ రామ
పరి పరి విధముల మొరలిడ వినక న
న్నర మర చేసిన హరి నిన్నేమందు || కట కట ||
భావజ జనక నా భావమెరుగ వే
వే వేగమున జూడవే ఓ రామ
దేవాది దేవ దేవ దీనశరణ్య
నీవే దిక్కని నిక్కము నమ్మితి || కట కట ||
గీర్వాణనుత భద్రగిరివాస సర్వ యో
గీశ్వరేశ్వర రామ ఓ రామ
సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయ
సర్వాధార పరాకేల రామా || కట కట ||
No comments:
Post a Comment