కరుణ జూడవే ఓ యమ్మ
కాకుత్సరాముని కొమ్మ || కరుణ ||
శరణంటి ననుగానవమ్మ
జనక తనయ సీతమ్మ || కరుణ ||
సరసిజాసను గన్న సాధ్వి నీమహిమల నెన్నగా
తరమే యింద్రాదులకైనా తధ్యమిది యని స్మృతులచే విన్నా || కరుణ ||
కలకంటి నీ ముద్దులమోము కనుగొంటి నాదే భాగ్యము
ఎలనాగ నే నోచిన నోము ఎన్న ఎవరి శక్యము ఓ యమ్మ || కరుణ ||
పతితపావననామ నీ భాను వంశాబ్ధి సోముని
క్షితి విజయుని నేలిన ఘనుని చెలిమిచేసిన పరమ కళ్యాణి || కరుణ ||
భద్రాద్రివాసుని కొమ్మ భద్రాద్రి శ్రీరామదాసుని కమ్మ
భద్రములొసగుమి అమ్మా భద్రం భవతుతే మాయమ్మ || కరుణ ||
Download
No comments:
Post a Comment