రామ దైవశిఖామణి సురరాజ మహోజ్వల భూమణి || రామ ||
తామర సాక్ష సుధీమణి భవ్య తారక భక్త చింతామణి || రామ ||
నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగా
వేడుకై మిము పొగడ గంటిగా నన్ను దిగవిడనాడ వద్దంటిగా || రామ ||
చింతసేయగ నేమిలేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా
ఇంతకు మిక్కిలి రాబోదుగా నే యితరుల గొలిచేది లేదుగా || రామ ||
తమ్ముడు నీవొక జంటను రామదాసుని రక్షించుటను
సమ్మతి నుండు మాయింటను భద్రాచల వాస నీ బంటును || రామ ||
No comments:
Post a Comment