తెలియకనే మోసపోతిని
దేవదేవుండని తెలియనైతి నళినాక్షి కేవలమగు
శ్రీభద్రాచల ధాములయిన శ్రీరామలక్ష్మణులు
నిశ్చలముగ వివరింపనైతి చాలానిశిలో ద్వారమందున తలుపులు
గొట్టుచు బిల్వగా సామాన్యులని నేనెంచుకొంటిని

రక్షింపమని వేడనయితిని
ద్రవ్యాపేఖ గలిగిన వాడనైతినితక్షణమున నార్లక్షల వరహాల్నిర్లక్ష్యముగ నొసంగిన
సాక్షాత్కరులను వక్షమున కరుణాకటాక్ష వీక్షణాలుంకార దాసజన
శిక్షభక్తజన పక్షభూవనరక్షక నిను రక్షింపుమనినే

కనుకానని వాడనైతిని
మనమున నతడాది దేవుడనుచు భక్తి
వినయపూర్వకముగ బొగడుచు వేగముగ
శ్రీపాదపద్మములు నెనరుమీరు పట్టుకొని
ననేలుకొమ్మని యడుగనైతిని
మనమున నతడాది దేవుడనుచు భక్తి
వినయపూర్వకముగ బొగడుచు వేగముగ
శ్రీపాదపద్మములు నెనరుమీరు పట్టుకొని
ననేలుకొమ్మని యడుగనైతిని
పసిడిశాలువ గప్పనైతిని
మంచి పన్నిరుపైచిల్క నైతినే విశదముగాయింకను వేగమే కృపతోను
దశకంఠానుజునకు మసలక నొసగియు శశిముఖి సీతతో భద్రాచలమున వసియి చివేగ
వసుధలోపల రామదాసుని పొసగనేలిన రామచంద్రుని

No comments:
Post a Comment