కోదండ రామ కోదండ రామ
కోదండ రామ మాంపాహి
కోదండ రామ మాంపాహి
నీ దండ నాకు నీవెందు బోకు
వాదేల నీకు వద్దు పరాకు
శ్రీ రామ మమ్ము చేపట్టు కొమ్ము
ఆరోగ్య మిమ్ము ఆదుకోరమ్ము
వాదేల నీకు వద్దు పరాకు
శ్రీ రామ మమ్ము చేపట్టు కొమ్ము
ఆరోగ్య మిమ్ము ఆదుకోరమ్ము
మణి మయ భూష మంజుల భాష
రణ జయ ఘోష రమనీయ వేష
దశరధ బాల దాసానుకూల
దశముఖ కాల ధరణిష పాల
రణ జయ ఘోష రమనీయ వేష
దశరధ బాల దాసానుకూల
దశముఖ కాల ధరణిష పాల
పుట్టింప నీవె పోషింప నీవె
ఫలమీయ నీవె భాగ్యము నీవె
శరణన్న చోట క్షమసేయు మాట
బిరుదు నీ దోట ఎరిగిన మాట
ఫలమీయ నీవె భాగ్యము నీవె
శరణన్న చోట క్షమసేయు మాట
బిరుదు నీ దోట ఎరిగిన మాట
లాలిత హాస లక్ష్మీ విలాస
పాలిత దాస భద్రాద్రి వాస
శ్రీవిజయ రామ శ్రీ తులసీ దామ
పావన రామ భద్రాద్రి రామ
పాలిత దాస భద్రాద్రి వాస
శ్రీవిజయ రామ శ్రీ తులసీ దామ
పావన రామ భద్రాద్రి రామ
Download
No comments:
Post a Comment