భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

జో రవికుల

జో రవికుల శుభాంగా జో సన్నుతాంగా
కరుణారసాపాంగ కరుణాంత రంగా 

శ్రీ వెలయ క్షీరవారధి పవ్వలింప
దేవబృందము లెల్ల దివిసన్నుతింప
భావమెంచిన వారి భక్తి పూజింప
దైవరాయా మాకు తరమె వర్ణింప 

గురుతరంబుగ ధర్మగుణము చేపట్టి
కరుణతో కౌసల్య గర్భమున బుట్టి
దురితదానవుగట్టి దురములోగట్టి
శరణాగతత్రాణ బిరుదుచేపట్టి 

కమల సంభవ వినుత ఘనగుణ సాంద్రా
అమిత దుష్ట భుజంగ అహితుండ కేంద్రా
విమల వైభవముల వెలయు దేవేంద్రా
రమణితో వెలసితివి రఘు రామచంద్రా

No comments:

Post a Comment