రామహో రఘురామహో హే సీతా
రామ హో రఘు రామ హో || రామహో ||
రామ హో భద్రశైల ధామ హో భక్తపాల
నేమహో సీతాలోల స్వామి హో సత్యశీల హో || రామహో ||
అగణిత గుణధామ అజభవ నుత నామ
నగధర మేఘశ్యామ నత జనాశ్రిత కామ || రామహో ||
శరధి బంధన శౌర్య శతృసంహార ధైర్య
గురు జన కార్య ధుర్య కోమలాంగ సౌందర్య || రామహో ||
శరదిందు నిభానన శతమన్మధ సమాన
నిరుపమానంద ఘన నిజదాసావన రామ || రామహో ||
No comments:
Post a Comment