భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

ఎంతకెంతకు మందలింతు

ఎంతకెంతకు మందలింతు నయ్యయో పంతగించేవు స్వామి పట్టాభిరామా 

ఎంతవాడను గాను విడనాడకుమి నన్ను భ్రాంతి మీర మరి శాంతిచెంది విశ్రాంతినొందకను చింత తీరదిక 

ఏలుకొన్న వాడవు మమ్మేల దయ చూడవు తాళు రక్షింతునని దండ మాటాడవు ఈలాగునున్నందుకు ఏలాగు తాళుకొందు పాలముంచు మరి నీళ్ళముంచు మా పాలి రామ భూపాల తిలక ఇక 

నిన్నే నమ్మినారము నీ వారమైనాము సన్నుతించ నేరము స్వామి నీదే భారము ఆమాట కేమి గాని ఆమీదనే ఇత్తు గాని యేమరించి యముడేమి సేయునో జాము జామునకు మోము చూపుమిక 

భావుకాద్రి నాయక భక్తి ఫలదాయక దేవాదిదేవ భవ్య దివ్య సత్యనాయక రావే మహానుభావ రామదాసుని బ్రోవ యేవకించితివ దేవురించితిని సంతరించుమని దీవరించితిని


Download

No comments:

Post a Comment