భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label అబ్బబ్బ దెబ్బలకు. Show all posts
Showing posts with label అబ్బబ్బ దెబ్బలకు. Show all posts

Friday, May 21, 2010

అబ్బబ్బ దెబ్బలకు

అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా
రామప్ప గొబ్బున నన్నేలుకోరా 

మేలు చేయుదునంటి గదరా
మేలు చేసితేనేమి భయమంటిగదరా
వరహాలు మొహరీలు జమచేస్తిగదరా
నీ పరిచారులకు నేపెట్టితి గదరా 

పరులకొక్కరువ్వ యీయ లేదుగదరా
ఓ పరమాత్మ నీపాదముల్ నమ్మితిరా
కొరడాలు తీసుక గొట్టిరిగదరా
హరిసుత గోవింద హరితాళలేరా 

అంతటి నిన్ను నెరనమ్మినారా
శరణాగత గోవిందహరి తాళలేరా
శరధిబంధించిన శౌర్యమెక్కడరా
రాక్షస సంహార రక్షింపరా 

రామ భద్రాద్రిరామ సీతారామా
నీ నామమెప్పుడు భజియించితి గదర
రామదాసుని నిటుల చేయించితేరా


Download