భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label రక్షించు దీనుని. Show all posts
Showing posts with label రక్షించు దీనుని. Show all posts

Friday, May 21, 2010

రక్షించు దీనుని

రక్షించు దీనుని రామ రామ నీ
రమణితోడు నన్ను రక్షింపకున్న మీ
తండ్రి దశరధరాజు తోడు || రక్షించు ||

అరుదు మీరగ విభీషణుని బ్రోచితి వల్లనాడు అట్లు
కరుణింపకున్నను మీతల్లి కౌసల్య తోడు || రక్షించు ||

గిరిగొన్న ప్రేమ సుగ్రీవు బ్రోచితి వల్లనాడు అట్లు
సిరులియ్యకున్నను మీకులగురు వసిష్టు తోడు || రక్షించు ||

అలివేణి యహల్య శాపము బాపితి వల్లనాడు అట్లు
కలుషములు బాపకున్న లక్ష్మణుని తోడు || రక్షించు ||

పాపాత్ముడైన కబంధు బ్రోచితి వల్లనాడు అట్లె
నెపము లెన్నక కృపచూడకున్న మీయింటి తోడు || రక్షించు ||

వదలక నీమీదనే నాసలు బెట్టవలసె నేడు
భద్రాద్రి రామదాసుని ఏలకున్న నీపాదము తోడు || రక్షించు ||


Download