భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label అయ్యయ్యో నే నేరనైతి. Show all posts
Showing posts with label అయ్యయ్యో నే నేరనైతి. Show all posts

Thursday, May 20, 2010

అయ్యయ్యో నే నేరనైతి

అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి || అయ్యయ్యో ||

వెయ్యారు జన్మాల వెత జెందితిగాని
చెయ్యన సద్గతి సాధింప లేనైతి || అయ్యయ్యో ||

మోస మేమని తలచియుండు దోస
వాసనల తగిలి తేమందు ఆశా
పాశములను అరసి బ్రోచి ముందు
వాసిగ వైరాగ్య వాసన గననైతి || అయ్యయ్యో ||

మూడు మేలని నమ్మియుంటి నిరు
మూడు శత్రుల కూడియుంటి మాటికి
రెంటి మార్చి శత్రు మూటికెక్కువైన
కూటస్థు పొగడ నేనుకూడ లేనయితి || అయ్యయ్యో ||

వదలించి బంధముల విడజేసిన భద్ర
గిరి రాఘవులతో నేను కలసి
సదయుడవై గని శ్రీరామదాసుని
స్థిరముగ పోషించుడని వేడనైతి || అయ్యయ్యో ||