భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label జానకి రమణ. Show all posts
Showing posts with label జానకి రమణ. Show all posts

Friday, May 21, 2010

జానకి రమణ

జానకి రమణ కళ్యాణ సజ్జన
నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ || జానకి ||

ఓనమాలు రాయగానే నీ నామమే తోచు
నీ నామమే తోచు శ్రీరామా || జానకి ||

ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు
అందమె గానవచ్చు శ్రీరామా || జానకి ||

ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి
మునులెల్ల మోహించిరీ శ్రీరామా || జానకి ||

దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో
దృష్టి తాకును ఏమో శ్రీరామా || జానకి ||

ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవె
నిన్నే భజింప నీవే శ్రీరామా || జానకి ||

ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రము చాలు
భక్తిమాత్రము చాలు శ్రీరామా || జానకి ||

రాతి నాతిగజేసె నీ తిరువడిగళె కాదా
నీ తిరువడిగళె కాదా శ్రీరామా || జానకి ||

నారదాది మునులు పరమపద మందిరిగద
పరమపద మందిరిగా శ్రీరామా || జానకి ||

సత్య స్వరూపముగ ప్రత్యక్షమై నావు
ప్రత్యక్షమై నావు శ్రీరామా || జానకి ||

భద్రాచల నివాస పాలిత రామదాస
పాలిత రామదాస శ్రీరామా || జానకి ||


Download