భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label రామ నీ దయ. Show all posts
Showing posts with label రామ నీ దయ. Show all posts

Friday, May 21, 2010

రామ నీ దయ

రామ నీ దయ రాదుగా పతిత పావన
నామమే బిరుదుగా శ్రీ రామా || రామ ||

సామజ వరదా నిన్నేమని దూరుదు
ఏమి యదృష్టమో ఎంత వేడిన రావు || రామ ||

ఈవు లడుగ జాలగా శ్రీపాద
సేవ మాకు పదివేలుగా రామ
భవజనక నీ భావము తెలిసియు
నీ దైవమనుచు నే నమ్మియున్నాను || రామ ||

నీకే మరులు కొంటిగా నే నితరు
లకు లోనుగాక యుంటిగా రామా
ఆకొన్నవాడనై యనవలసి యుంటి గాని
నీకు దయరాకున్నా నే నేమిసేయువాడ || రామ ||

ప్రేమ నిబ్బరమాయెగా భద్రాచల
ధామాయని మేమో మాయెగా రామా
భూమిజ నాయక నా స్వామి నీ వనుచు
కామించు రామదాసుని బ్రోవ || రామ ||


Download