భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label పాలయమాం రుక్మిణీ. Show all posts
Showing posts with label పాలయమాం రుక్మిణీ. Show all posts

Friday, May 21, 2010

పాలయమాం రుక్మిణీ

పాలయమాం రుక్మిణీ నాయక భక్త కామితదాయక
నీలవర్ణ తులసీ వనమాల నిరుపమశీల బృందావనలోల || పాలయమాం ||

కనకాంబరధ్అర కమనీయ విగ్రహ కాళీయ మదనిగ్రహ
సనకాది సన్నుత చరణారవింద సచ్చిదానంద గోవింద ముకుంద || పాలయమాం ||

గోపవేషధర గోవర్ధనోద్ధార గోకులకలహంస
పాపాంధకార దివాకర శ్రీకర తాపసమానస సారస హంస || పాలయమాం ||

నీలాంబరధర నిత్య నిర్వికార నిగమాంత సంచార
బాలార్కకోటి ప్రకాశావిలాస రామదాస హృదయాజ్ఞ నివాస || పాలయమాం ||


Download