భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label నా తప్పులన్ని. Show all posts
Showing posts with label నా తప్పులన్ని. Show all posts

Friday, May 21, 2010

నా తప్పులన్ని

నా తప్పులన్ని క్షమియించుమీ జగ
న్నాథా నీవాడ రక్షింపుమీ || నా తప్పులన్ని ||

పాతకుడని ఎంచక పోషించు
దాత వనుచు నీ పదములె నమ్మితి || నా తప్పులన్ని ||

ఈయెడ నానేరము లెంచక హిత
వై తే ద్వేషము లెంచకు మ్రొక్కెద
చేయరాని పనులెన్నో చేసితి
కాయ తీగ కెక్కువ కాదు గదా || నా తప్పులన్ని ||

కడుపున బుట్టిన తనయుడు ఎంతో
దుడుకుతనము చేసిన గాని
కొడుకా రమ్మని పిలుచును నూతిలో
పడత్రోయునా తండ్రి ఎవరైన || నా తప్పులన్ని ||

దాసుని మనవిని వినుము చక్రధర
వాసవ నుత నన్నేలుకొంటివా
నా స్వామి నమ్మితిని భద్రాద్రి ని
వాసుడ రామదాసు నేలు తండ్రి || నా తప్పులన్ని ||


Download