భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label రామ నామనవిని. Show all posts
Showing posts with label రామ నామనవిని. Show all posts

Friday, May 21, 2010

రామ నామనవిని

రామ నామనవిని చేకొనుమా దైవ ల
లామ పరాకుచేయకుమా || రామ ||

స్వామి భద్రాచల ధామ పావన దివ్య
నామ గిరిజ నుత భీమ పరాక్రమ || రామ ||

దరిలేని జనులను గాచే
బిరుదుపూనితివి ఖ్యాతిగాను
బరువగు నాబాధలను తీర్ప నీ
మరుగు జేరితి నన్నరమరచేయకు || రామ ||

కపట మానసుడని మదిని యెన్న
కిపుడు రక్షింపు సమ్మతిని
అపరాధములకు నే నాలయమైతిని
కృపజూడుము నన్ను నెపము లెన్నకు || రామ ||

పతిత పావన మూ ర్తివైన నీవే
గతియని యుండితి మదిలోన
సతతము రామదాస పతివై భద్రాద్రిని
అతులిత వై భవతతులచే నెలకొన్న || రామ ||