భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label ఎటుబోతివో రామ. Show all posts
Showing posts with label ఎటుబోతివో రామ. Show all posts

Friday, May 21, 2010

ఎటుబోతివో రామ

ఎటుబోతివో రామ ఎటుబోతివో
ఎటుబోతివో నిన్ను నే వేడుకొనుచుంటె
నేడు నాకనుల జూతామంటె

అంధకారమువంటి బందిఖానాలో
నన్ను నిందల నెడబాపవే నీకు మ్రొక్కెద స్వామీ

పాపములన్ని యెడపాపెడి దొరవు నీవు
ఆపదలదీర్చి నన్నాదుకొమ్మంటి స్వామి

తానీషాగారు వచ్చి సరితీర్పు చేసెదరు
పైకము బంపించి వేగం నను వదలింప

అపరాధినినని చాల నుతిచేసి మొరలిడగ
వెనుకటి నేరము లెంచకు నా స్వామి

అప్పుల వారొచ్చి యరికట్టుచున్నారు
ఓప్పుకోబడునని చెప్పక దాగినావె

నీవు భద్రాచల నిలయుడవయ్య రామ
బ్రోవవయ్య రామదాసునేలెడి స్వామీ