భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label ఇక్ష్వాకు కుల తిలక. Show all posts
Showing posts with label ఇక్ష్వాకు కుల తిలక. Show all posts

Thursday, May 20, 2010

ఇక్ష్వాకు కుల తిలక

ఇక్ష్వాకు కుల తిలక యికనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా || ఇక్ష్వాకు ||

చుట్టు ప్రాకారములు సొంపుగచేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||

గోపుర మంటపాలు కుదురుగ కట్టిస్తి రామచంద్రా నను
క్రొత్తగ చూడక నిత్తరి బ్రోవుము రామచంద్రా || ఇక్ష్వాకు ||

భరతునకు చేసితి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||

శత్రుఘ్నునకు నేను చేసితి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాడునకు పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా || ఇక్ష్వాకు ||

లక్ష్మణునకు చేసితి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||

వాహనములు మీకు వరుసతో చేసితి రామచంద్రా జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా || ఇక్ష్వాకు ||

కలికి తురాయి నీకు పొలుపుగ చేసితి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా || ఇక్ష్వాకు ||

మీ తండ్రి దశరథ మహారాజు మెట్టెనా రామచంద్రా
లేక మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా || ఇక్ష్వాకు ||

అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా || ఇక్ష్వాకు ||

సర్కారు పైకము తృణముగ నెంచకు రామచంద్రా
దెబ్బల కోర్వను అప్పుతీర్పుమయ్య రామచంద్రా || ఇక్ష్వాకు ||

ఏటికి చల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా
నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా || ఇక్ష్వాకు ||

కౌసల్య పుత్రుడు దశరధ తనయుడు రామచంద్రా
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీ రామచంద్రా || ఇక్ష్వాకు ||

భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని నేలుము || ఇక్ష్వాకు ||

Download