భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label దశరధరామ గోవింద. Show all posts
Showing posts with label దశరధరామ గోవింద. Show all posts

Friday, May 21, 2010

దశరధరామ గోవింద

దశరధరామ గోవింద నన్ను దయజూడు పాహి ముకుంద || దశరధ ||

దశముఖ సంహార ధరణిజపతి రామ
శశిధర పూజిత శంఖచక్రధర || దశరధ ||

మీ పాదములే గతి మాకు మమ్మేలుకో స్వామి పరాకు
మా పాల కలిగిన శ్రీపతి ఈప్రొద్దు కాపాడి రక్షించు కనకాంబరధర || దశరధ ||

నారాయణ వాసుదేవ నిను నమ్మితి మహానుభావ
గరుడగమన హరి గజరాజ రక్షక పరమపురుష భక్త పాప సంహరణ || దశరధ ||

తారకనామమంత్రము రామదాసులకెల్ల స్వతంత్రము
ఇరవుగ కృపనేలు యిపుడు భద్రాద్రిని స్థిరముగ నెలకొన్న సీతామనోహర || దశరధ ||


Download