భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label పలుకే బంగారమాయెనా. Show all posts
Showing posts with label పలుకే బంగారమాయెనా. Show all posts

Friday, May 21, 2010

పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||

ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||

రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||

ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు
పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||

శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా
కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||


Download