భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label ఏడ నున్నాడో. Show all posts
Showing posts with label ఏడ నున్నాడో. Show all posts

Friday, May 21, 2010

ఏడ నున్నాడో

ఏడ నున్నాడో భద్రాద్రి వాసుడు
ఏడ నున్నాడో నాపాలి రాముడు
ఏడ నున్నాడో జాడ తెలియరాదు
నాడు గజేంద్రుని కీడు బాపిన స్వామి 

ద్రౌణి బాన జ్వాల దాకిన బాలునికి
ప్రాణమిచిన్న జగత్ ప్రాణరక్షకుడు
పాంచాలి సభ లోన భంగ మొందిన నాడు
వంచన లేకను వలువలిచ్చిన తండ్రి 

దూర్వాసుడు ఉగ్రమున ధర్మసుతుని జూడ
నిర్వహించిన నవనీత చోరకుడు
అక్షయముగ శ్రీభద్రాచల మందున
సాక్షాత్కరించిన జగదేక వీరుడు


Download