భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label తగునయ్య దశరథ. Show all posts
Showing posts with label తగునయ్య దశరథ. Show all posts

Friday, May 21, 2010

తగునయ్య దశరథ

తగునయ్య దశరథ రామచంద్ర దయదలపవేమి నీవు
పగవాడనా యెంతో బలిమాలిననుగానిపల్కవే
నగుమోము జూపరనాయన్నా నిను చాల నమ్మినాను
ఇంత అడుగుగాజూచిన నావలనెవరిపాలయ్య నేను 

పతితులనెల్ల మవనుల జేయుదునని పలుకవేల యిపుడు
అతిఘోర ఖలుండనుచు మమ్మును విడనాడనేల
మన్నించి కావరాకున్నావు ఓ రామ నిన్ను నమ్మినాను
నిన్నేగాని పరులనెన్నబోను నా కన్నులార 

పదపడిమిము జేరబడిన వారలను చేపట్టలేదా
నన్నువదలిన మీవంటివారికి నపకీర్తిగాదా
అనుదినము భద్రాద్రి రాముడవని నిన్ను నమ్మినాను
నేను వినయముతో రామదాసుడనని విన్నవించినాను