భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label రామా నీచేతేమీ. Show all posts
Showing posts with label రామా నీచేతేమీ. Show all posts

Friday, May 21, 2010

రామా నీచేతేమీ

రామా నీచేతేమీ కాదుగా
సీతా భామకైన చెప్పరాదుగా
సామాన్యులు నన్ను సకలబాధలుపెట్ట
నా మొరాలకించి మోమైన జూపవు 

శరచాపముల శక్తి దప్పెనా
నీ శౌర్యము జలధిలో జొచ్చెనా
కరుణ మాలి పైకము దెమ్మని భక్తి
పరులబాధింప నీ ధైర్యమెక్కడ బోయె 

శంఖ చక్రముల బట్టినందుకు
దాసజనుల రక్షింప వదెందుకు
పంకజాక్ష భక్తపరిపాలన లేద
పొంకము లేలగాని బింకము లేదయ్య

తల్లివనుకొంటిని నాయుల్లములో నమ్మియుంటిని
కల్లరిజనములు కారు బారుచేయ
చల్లని కృప నాపై జల్లవైతివి యిపుడు 

నా యింటి వేల్పు వనుకొంటిని
నీకంటె దైవము లేదంటిని
నొంటిగ పైకము తెప్పించుము యందె
వెంటనంటి నా జంటరావైతివి


Download