భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label ఎక్కడి కర్మములడ్డుపడెనో. Show all posts
Showing posts with label ఎక్కడి కర్మములడ్డుపడెనో. Show all posts

Thursday, May 20, 2010

ఎక్కడి కర్మములడ్డుపడెనో

ఎక్కడి కర్మములడ్డుపడెనో ఏమి సేయుదునో శ్రీరామా
అక్కట నా కన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా || ఎక్కడి ||

ప్రకటమాయెను పాపము లెటుల బాధకోర్తును శ్రీరామా
సకలలోక రాజ్యపదవికి ఎక్కువైన యట్టి శ్రీరామా || ఎక్కడి ||

పృధివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామ
విధులు జరుపవలయు విషయవాంఛలు తలుపక శ్రీరామ || ఎక్కడి ||

మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా
ఎన్నడిట్లుండి రాఘవ నే నెరుగ ననుగన్నయ్యా శ్రీరామా || ఎక్కడి ||

కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా
కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షించమంటి శ్రీరామా || ఎక్కడి ||