భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label కరుణించు దైవలలామ. Show all posts
Showing posts with label కరుణించు దైవలలామ. Show all posts

Thursday, May 20, 2010

కరుణించు దైవలలామ

కరుణించు దైవలలామ అహో
పరమ పావననామ పట్టాభిరామా || కరుణించు ||

అన్నవస్త్రము లిత్తుమనుచు దొర
లన్నారు మనిచెదమనుచు ఆయు
రన్నం ప్రయచ్ఛతి యనుచు నూర
కున్నాను నీవే మాకున్నా వనుచు || కరుణించు ||

మరియింత కాలమ్ముదనుక మిమ్ము
మరచితిననుచు తప్పుతలచక మమ్ము
దరిజేర్చుడని వేడితిని మీది
శరణాగత త్రాణ బిరుదు గనుక || కరుణించు ||

పరుల గొలుచుటకన్న ఇల భద్ర
గిరి రాఘవుల వేదుకొనుట ఇహ
పరములకు దారియని వింటినే
దరహాసముఖ రామదాసపోష || కరుణించు ||