భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label ఇతరము లెరుగనయ్యా. Show all posts
Showing posts with label ఇతరము లెరుగనయ్యా. Show all posts

Friday, May 21, 2010

ఇతరము లెరుగనయ్యా

ఇతరము లెరుగనయ్యా నాగతి నీవే రామయ్య
సతతము సీతాపతి నీ వేయనిమదినమ్మితిసద్గతి జెందింపుము 

కోపము చేయవద్దు నాకోరికలొసగుము యీ ప్రొద్దు
ప్రాపుదాపు నా ప్రాణమునీవే యీ పట్టనమిము పట్టువిడువనిక
పామరుడని విడువవద్దు నా పాపము బాపుమీ ప్రొద్దు

తప్పులెన్న వద్దంటి నాతల్లి దండ్రి నీవంటి మా
యొప్పులకుప్పవటంటి మాయప్పవు నీవనుకొంటి
అప్పటప్పటికి తప్పక నీవే తిప్పలబెట్టక తీర్చిదిద్దుకొను

నా మీదను దయరాదా రామా నామనవిని వినరాదా
వేమరు నాతోవాదా నను వెరవకుమీ యనరాదా
ప్రేమమీర మా భద్రాచల పురిధాముడవై రామదాసుని నేలుము