భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label ఏల దయ రాదో. Show all posts
Showing posts with label ఏల దయ రాదో. Show all posts

Thursday, May 20, 2010

ఏల దయ రాదో

ఏల దయ రాదో రామయ్య
ఏల దయ రాదో రామయ్య నీకు || ఏల ||

శ్రీ మేలుకై పాటుపడితినని యే
ల యీ యభాండము చాలు చాలును || ఏల ||

బ్రహ్మ గూర్చెగదా అహోపర
బ్రహ్మ కావగదే రామ
బ్రహ్మ జనక భవ బ్రహ్మేంద్రాదులు
బ్రహ్మానందము పాలై నారట || ఏల ||

పాపములచేత రామయ నే
నోపలేనుగద రామ
శ్రీపతి ఏ ప్రాపులేకను నీ
ప్రాపె గోరితి భక్త పాపహరణ హరి || ఏల ||

తలపగ చాల ఆనంద
బాష్పము లూరెగద రామ
నీల నీరదనిభ కోమలరూపభద్ర
శైల వాస రామదాసు నేలగ || ఏల ||

Download