భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label వందే రఘురామ. Show all posts
Showing posts with label వందే రఘురామ. Show all posts

Friday, May 21, 2010

వందే రఘురామ

వందే రఘురామ శుభనామ శుభనామ
తులసీ దళధామాభిరామ శ్రీరామ || వందే ||

కనక మణిమయహార సుకుమార సుకుమార
పంక్తి రధ మహిత కుమారా సువిహార
అరిసూర భూధర ధరకల్మషదూర
పాలిత వానర దారుణ కారణ మురహరణ రఘు
వీర నీరదాభ విమలశరీర నిర్వికార || వందే ||

వందిత అనిమిష సత్యభావ సీతానన
భక్తపోష బుధతోష దళితదోష సజ్జన పోష
మానుషవేష సంగరభీషణదాస సుపోషణ నిజతోష
రత్నభూష రమ్యవేష సురాంభోజ పుంజప్రత్యు
ష సుమానస భ్ఋంగ మునిరాజవేష శ్రీరామ || వందే ||

కుంతల జిత నీల భక్తపాల భక్తపాల
అసురద్వేష పటలపాల వరశీల కనకచేల
కాంతిజాల మానుషశరీర దానవ బాలక
తావక సేవక సురసాల భూపాల పాలక
కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల || వందే ||

ధరణిజ సత్కళత్ర సుచరిత్రసురిత్ర
మునిస్తోత్ర మృదయాబ్జమిత్ర సత్పవిత్ర
త్రిశర జైత్ర నీరజనేత్ర వారిజగాత్ర
విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర
అజపవిత్ర అతురమిత్ర విభీషణపరస్తోత్ర పాత్ర || వందే ||

భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి
రాభ మదేభ హర్యక్ష మృదు పక్షపం కేరుహాక్ష
నిజరూపాక్ష శతృవిపక్ష వసురేషణ
వీక్షణ శిక్షణ దాక్షణ రామదాస
భద్రాద్రీశ దుష్టశిక్షక శిష్టరక్షక అహోరామ || వందే ||


Download