భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label దినమే సుదినము. Show all posts
Showing posts with label దినమే సుదినము. Show all posts

Friday, May 21, 2010

దినమే సుదినము

దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే ||

ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి
చేతనైనా మిమ్మే తీరుగ తలచిన ఆ || దినమే ||

అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ
సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే ||

నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు
వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే ||

మృదంగ తాళము తంబురశృతి గూర్చి
మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే ||

ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ
మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే ||

భక్తులతో ననురక్తిని గూడక
భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే ||

దీనశరణ్య మహానుభావ యోగానలోల
నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే ||

వాసిగ శ్రీహరిదాసుల గూడుకొని
వాసుదేవు వాంఛతోను పాడెడి ఆ || దినమే ||

అక్కరతోడ భద్రాచలమునను
చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||


Download