ఎవరు దూషించిననేమి మరి ఎవరు దూషించిననేమి
అవగుణము మాన్పి యార్చేరా తీర్చేరా
నవనీతచోరుడు నారాయణుడుండగ
అవగుణము మాన్పి యార్చేరా తీర్చేరా
నవనీతచోరుడు నారాయణుడుండగ
పిమ్మటనాడిననేమి మంచిప్రియములు పలికిననేమి
కొమ్మరో రమ్మని కోరికలొసగెడి సమ్మతినాపాలి సర్వేశ్వరుండుండగ
కొమ్మరో రమ్మని కోరికలొసగెడి సమ్మతినాపాలి సర్వేశ్వరుండుండగ
వాని పంతము మాకేల వట్టివాదులతోడ పోరేల
భాషించువారితో పలుమారు పొందేలకాచి రక్షించెడి ఘనుడు రాముడు
భాషించువారితో పలుమారు పొందేలకాచి రక్షించెడి ఘనుడు రాముడు
అపరాధముల నెంచువారు మాకు ఉపకారులైయున్నారు
విపరీత చరితలువినుచు నెల్లపుడు కపటనాటకధారి కనిపెట్టి యుండగ
విపరీత చరితలువినుచు నెల్లపుడు కపటనాటకధారి కనిపెట్టి యుండగ
వారి వన్నెలు సల్పనేల మూడువాసనలకు భ్రమయనేల
వాసిగ భద్రాద్రివాసుడై నిరతము భాసురముగ రామదసుడైయుండగ
వాసిగ భద్రాద్రివాసుడై నిరతము భాసురముగ రామదసుడైయుండగ