భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label జనక తనయ. Show all posts
Showing posts with label జనక తనయ. Show all posts

Friday, May 21, 2010

జనక తనయ

జనక తనయ నాదు మనవి
గైకొని జగద్ జనకుని తో దెల్పవే ఓ జనని
పనిబూని ననుబెట్టె భాధాలన్నింటిని
పాటించి మది లెస్సగ ఓ జనని 

నిజముగ నీ పాద భజనచేసినవాని
నిర్దయ చూచినారు ఓ జనని
సుజనావళిని మున్నెటువలె బ్రోతిరో
నిజముగాదని తోచేను ఓ జనని 

అదుగో వచ్చెదరని ఇదుగో వచెదరని
ఎదురు చూచునుంటిని ఓ జనని
వదిగి చిన్నావో ఈ బంధిఖానాలోనే
వంటరిగా నుంటి గదా ఓ జనని 

ఇతరమెరుగక మీరెగతియని నమ్ముక
ఇదివరకున్నాడను ఓ జనని
సతతము భద్రాచల రామదాసుని
సంతరింప సమయము ఓ జనని


Download